ట్రాఫిక్ ఏసీపీ గోవర్దన్, సీఐ రవి ఆధ్వర్యంలో పంజాగుట్ట పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నియమాలు పాటిస్తున్న వారికి సినిమా టికెట్లు బహుమతిగా ఇచ్చారు. వాహనంపై ఏ విధమైన అపరాధ రుసుము లేకుండా... హెల్మెట్ కలిగియుండి, వెహికల్ ఇన్సూరెన్స్, పొల్యూషన్ వంటి పత్రాలు ఉన్న వారికి సినిమా టికెట్లు అందించారు. ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించి... డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గోవర్ధన్ తెలిపారు. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని... హెల్మెట్, సీట్లు బెల్ట్ ధరించడం బాధ్యతగా గుర్తించాలని ఏసీపీ పేర్కొన్నారు.
ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటిస్తే... సినిమా టికెట్ మీకే - Hyderabad Traffic Police
మీరు ట్రాఫిక్ నిబంధనలు తూ.చ తప్పకుండా పాటిస్తున్నారా... అయితే పోలీసుల మీకు కచ్చితంగా సినిమా చూపిస్తారు. ఎందుకనుకుంటున్నారా?
ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటిస్తే... సినిమా టికెట్ మీకే