హైదరాబాద్ నగరంలో ఈనెల 8న పలుచోట్ల తాగునీటి సరఫరాలో పాక్షిక అంతరాయం ఏర్పడనున్నట్లు జలమండలి ప్రకటించింది. విద్యుత్ లైన్ల మరమ్మతుల నేపథ్యంలో తాగునీటికి అంతరాయం కలుగనున్నట్లు వెల్లడించింది. సంతోశ్‌నగర్, వినయ్‌నగర్, సైదాబాద్, ఆస్మన్ఘడ్, యాకుత్‌పుర, మహబూబ్‌మాన్షన్, నారాయణగూడ, బొగ్గులకుంట, అడిక్‌మెట్, శివం రోడ్, చిలకలగూడ, రియాసత్‌నగర్, అలియాబాద్, మిరాలం, బీఎన్ రెడ్డి నగర్, ఆటోనగర్, వనస్థలిపురం సరఫరాలో అవాంతరాలు ఏర్పడతాయని పేర్కొంది.
హైదరాబాద్‌లో పలుచోట్ల తాగునీటి సరఫరాకు అంతరాయం - Hyderabad jalamandali news
హైదరాబాద్‌లో ఈనెల 8న పలుచోట్ల తాగునీటి సరఫరాలో పాక్షిక అంతరాయం ఏర్పడనున్నట్లు జలమండలి ప్రకటించింది. విద్యుత్ లైన్ల మరమ్మతుల నేపథ్యంలో తాగునీటికి అంతరాయం కలుగనున్నట్లు వెల్లడించింది.
వీటితో పాటు మారుతీనగర్, ఏలుగుట్ట, హబ్సిగూడ, నాచారం, బోడుప్పల్, తార్నాక, లాలాపేట్, మారేడ్‌పల్లి, కంటోన్మెంట్, ఎమ్ఈఎస్, ప్రకాశ్‌నగర్, మేకల మండి, బాలాపూర్, మైసారం, సాహెబ్‌నగర్, మైలార్ దేవ్ పల్లి, బండ్ల గూడ, పీడీపీ, గోల్డెన్ హైట్స్, సులేమాన్ నగర్, 9 నెంబర్ బోజగుట్ట, ఆళ్లబండ, గంధం గూడ, ఆసిఫ్ నగర్, ప్రశ్సన్ నగర్, మాదాపూర్, షేక్‌పేట్ రిజర్వాయర్ ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడనున్నట్లు చెప్పారు. నగరంలోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి కోరింది.