తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏమి'టీ' వాటిలో తాగుతున్నారా..! - చాయ్​ కప్పులపై ప్రత్యేక కథనం

భాగ్యనగరంలో ఎక్కడచూసినా పేపర్‌ కప్పుల్లో టీ తాగడం కనిపిస్తుంటుంది. పింగాణీ కప్పులను వినియోగించే టీస్టాల్‌ నిర్వాహకులు సైతం ఇప్పుడు వీటినే వాడుతున్నారు. అయితే ఇవి అనారోగ్యానికి కారకాలవుతాయని ఖరగ్‌పూర్‌ ఐఐటీ పరిశోధకులు ఇటీవల తమ అధ్యయనంలో తేల్చారు.

tea
ఏమిటీ.. వాటిలో తాగుతున్నారా!

By

Published : Dec 17, 2020, 9:07 AM IST

Updated : Dec 17, 2020, 9:33 AM IST

డిస్పోజబుల్‌ పేపర్‌ కప్పులో మూడుసార్లు 100 మి.లీ. చొప్పున తాగడం వల్ల 75 వేల అతి సూక్ష్మ హానికర ప్లాస్టిక్‌ కణాలు శరీరంలోకి వెళ్తాయి. 80-90 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వేడి కలిగిన 100 మి.లీ. ద్రవ పదార్థం ద్వారా 25 వేల మైక్రాన్ల ప్లాస్టిక్‌ కణాలు మనలోకి చేరతాయని.. స్టీల్‌ లేదా పింగాణీ గ్లాసుల్లో టీ తాగడం మంచిదని సూచిస్తున్నారు.

‘టీ’ ప్రియులు ఎక్కువే..

నగరంలో చాయ్‌ ప్రియులు ఎక్కువే. ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు ఇక్కడి 10వేలకు పైగా స్టాళ్ల వద్ద రద్దీనే. పాతబస్తీలోని ఓ కేఫ్‌ వద్దనే రోజుకు సుమారు 3వేల కప్పుల టీ అమ్ముడవుతుంది. ఇక మధ్యస్థ, సాధారణ హోటళ్లలో నిత్యం 2వేల కప్పుల టీ గుటుక్కుమన్పిస్తుంటారు. లాక్‌డౌన్‌కు ముందు పింగాణీ కప్పులు వాడగా అనంతర కాలంలో డిస్పోజబుల్‌ కప్పుల వాడకం పెరిగింది. వాటిలో వేడి ద్రవాలు తాగడం ద్వారా క్రోమియం, కాడ్మియం వంటి లోహాలు శరీరంలోకి వెళ్తాయని అధ్యయనంలో తేలింది. మృదువైన, తేలికైన ప్లాస్టిక్‌ ఎల్‌డీపీఈ (లో డెన్సిటీ పాలిథిలిన్‌) ఉండటం వల్ల సాధారణ పరిస్థితుల్లో ఈ కప్పుల రీసైక్లింగ్‌ సైతం కష్టతరమవుతోంది. ఇందుకోసం ప్రత్యేక పద్ధతులను అనుసరించాల్సి వస్తోంది.


ఇదీ చూడండిరూ.1100 కోట్లతో ఫియట్‌ డిజిటల్‌ హబ్‌

Last Updated : Dec 17, 2020, 9:33 AM IST

ABOUT THE AUTHOR

...view details