భాగ్యనగర శివారులో భారీగా పసిడి పట్టివేత - hyderabad latest crime news
15:44 February 25
హైదరాబాద్ శివారులో భారీగా పట్టుబడిన బంగారం
హైదరాబాద్ శివారులో డీఆర్‌ఐ అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని పట్టుకున్నారు. కోటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయల విలువైన మూడు కిలోలకు పైగా స్వర్ణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు.
బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ ప్రైవేటు బస్సును నగర శివారులో తనిఖీ చేయగా ఈ బంగారం బయపడిందని పేర్కొన్నారు. ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్నారని తెలిపారు. ఈ తనిఖీల్లో 31 విదేశీ బంగారం బిస్కెట్లను పట్టుకుని నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు.