తెలంగాణ

telangana

ETV Bharat / state

President Draupadi Murmu Hyderabad Tour : నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. ఆ మార్గాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు - Alluri Sitaramaraj 125th birth anniversary

President Draupadi Murmu Hyderabad Tour Today : అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు ఉత్సవాల్లో పాల్గొనేందుకు.. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము నేడు హైదరాబాద్‌కు రానున్నారు. గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ సహా పలువురు రాష్ట్రపతికి స్వాగతం పలకనున్నారు. మరోవైపు.. రాష్ట్రపతి పర్యటనతో ట్రాఫిక్​ పోలీసులు నగరంలో ఆంక్షలు విధించారు.

President Draupadi Murmu Hyderabad Tour
President Draupadi Murmu Hyderabad Tour

By

Published : Jul 4, 2023, 6:59 AM IST

Updated : Jul 4, 2023, 7:10 AM IST

President Draupadi Murmu Visit to Hyderabad Today : విప్లవ వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్ రానున్నారు. బెంగళూరు నుంచి భారత వాయుసేన విమానంలో ఉదయం 10 గంటలకు హకీంపేట విమానాశ్రయం చేరుకుంటారు.గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతరులు రాష్ట్రపతికి స్వాగతం పలకనున్నారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గాన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లనున్నారు. రాష్ట్రపతి నిలయం పరిశీలన, భోజనం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెలికాప్టర్‌లో గచ్చిబౌలి స్టేడియం బయల్దేరి వెళ్తారు. అక్కడ సాయంత్రం నాలుగు గంటల నుంచి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం హెలికాప్టర్‌లో హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు చేరుకొని.. అక్కడి నుంచి భారత వాయుసేన విమానంలో సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము నాగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు.

రాష్ట్రపతి ద్రౌపదిముర్ము హైదరాబాద్​ పర్యటన షెడ్యూల్​ ఇదే..

  • బెంగళూరు నుంచి భారత వాయుసేన విమానంలో ఉదయం 10 గంటలకు హకీంపేట విమానాశ్రయం చేరుకుంటారు.
  • అక్కడి నుంచి రోడ్డుమార్గాన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు.
  • రాష్ట్రపతి నిలయం పరిశీలన, భోజనం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్​లో గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుంటారు.
  • సాయంత్రం నాలుగు గంటల నుంచి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.
  • ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి పాల్గొంటారు.
  • కార్యక్రమం అనంతరం సాయంత్రం హెలికాప్టర్​లో హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్​కు చేరుకుంటారు.
  • సాయంత్రం ఆరు గంటలకు భారత వాయుసేన విమానంలో నాగపూర్ బయల్దేరి వెళ్తారు.

President Speech at Dundigal Air Force Academy : 'ఫైటర్‌జెట్‌ పైలట్లలో మహిళలు ఉండటం సంతోషకరం'

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు :రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సైబరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ద్రౌపదిముర్ము గచ్చిబౌలి స్టేడియాన్ని సందర్శించనుండటంతో గచ్చిబౌలి నుంచి లింగంపల్లి రోడ్డు వరకు ఆంక్షలు పెట్టారు. గచ్చిబౌలి స్టేడియం వైపు వాహనాలను దారి మళ్లించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని.. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. రాష్ట్రపతి పర్యటనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

అల్లూరి సేవలను స్మరించుకున్న సీఎం కేసీఆర్‌ : దేశ స్వాతంత్య్రం కోసం, స్వయం పాలన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటీష్ పాలకులతో పోరాడిన అల్లూరి సీతారామరాజు త్యాగం గొప్పదని, స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఆయన అమరత్వం అజరామరమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం నేడు హైద్రాబాద్‌లో జరుగుతున్న సందర్భంగా దేశం కోసం వారు చేసిన త్యాగాలను సీఎం స్మరించుకున్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Jul 4, 2023, 7:10 AM IST

ABOUT THE AUTHOR

...view details