President residence in Bollaram: హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన ఉగాది ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలెడ్జ్ గ్యాలరీ, కిచెన్ టన్నెల్‌లో పాటు పలు కార్యక్రమాలను వర్చవల్‌గా రాష్ట్రపతి ప్రారంభించారు. గత నెలలో రాష్ట్రపతి నిలయంలో బస చేసే అవకాశం దొరికిందని.. భవనం పూర్తి నిర్మాణ చరిత్ర తెలుసుకోవడం సంతోషకరమన్నారు. తన హయాంలో బట్టర్ ఫ్లైరాక్, నక్షత గార్డెన్స్, స్టెప్ వెల్స్, తెలంగాణ సంప్రదాయ కళతో కిచెన్ టన్నెల్ పునర్నిర్మాణం, ప్రారంభించడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
Ugadi celebrations at Rashtrapati Nilayam: అనంతరం గవర్నర్‌తో కలిసి ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. డిసెంబర్ నెల మినహా మిగతా అన్ని రోజుల్లో రేపటి నుంచి రాష్ట్రపతి నిలయాన్ని ప్రజల సందర్శనార్థం అనుమతించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సోమవారం, ప్రభుత్వ సెలవు దినాలు మినహా మిగతా అన్ని రోజుల్లో రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించవచ్చు.
"రాష్ట్రపతి నిలయం విశేషాలు ప్రజలు కూడా తెలుసుకోవాలి. ప్రజలు తెలుసుకోవాలనే సందర్శనకు అనుమతించాం. రాష్ట్రపతి నిలయం విశేషాలు నాలెడ్జ్ గ్యాలరీలో లభిస్తాయి. తెలంగాణ సంప్రదాయ కళతో కిచెన్ టన్నెల్ పునర్నిర్మాణం నా హయాంలో బట్టర్ ఫ్లై, రాక్, నక్షత్ర గార్డెన్స్ ప్రారంభించడం సంతోషంగా ఉంది".- ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి
రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్సైట్లో టికెట్లు:గతంలో రాష్ట్రపతి శీతాకాల విడిది అనంతరం పక్షం రోజుల పాటు ప్రజల సందర్శనకు అవకాశం ఉండేది. అయితే 162 ఏళ్ల రాష్ట్రపతి నిలయం చారిత్రక ప్రాధాన్యాన్ని అందరికి తెలియాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేందుకు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్ సైట్ నుంచి ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.. లేకుంటే అక్కడకు వెళ్లి నేరుగా టికెట్లు తీసుకోవచ్చునని అధికారులు తెలిపారు.