తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా వైరస్​పై నాటక ప్రదర్శన

హైదరాబాద్​ అడ్డగుట్ట ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో నర్సింగ్​ విద్యార్థులు కరోనా వైరస్​పై నాటకం ప్రదర్శించారు. జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి వ్యాధులు సోకవని కళాశాల వైస్​ ప్రిన్సిపల్​ సూచించారు.

By

Published : Feb 1, 2020, 10:39 AM IST

dramatic-performance-on-coronavirus-in-hyderabad
కరోనా వైరస్​పై నాటక ప్రదర్శన

జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి వ్యాధులు సోకవని, కరోనా వైరస్​ వల్ల ఎలాంటి ముప్పు ఉండకుండా ఆరోగ్య సూత్రాలు పాటించాలని ఈస్ట్​ మారేడుపల్లిలోని ఈశ్వరిబాయి నర్సింగ్​ కళాశాల వైస్​ ప్రిన్సిపల్​ సూచించారు. అడ్డగుట్ట ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో నర్సింగ్​ విద్యార్థులు కరోనా వైరస్​పై నాటకం ప్రదర్శించారు.

చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్​ వల్ల ఎలాంటి భయం లేదని, ఇంట్లో పరిశుభ్రత, శరీర, ఆరోగ్య సూత్రాలు పాటించాల్సిన అవసరం ఎంతైన ఉందని కళాశాల వైస్​ ప్రిన్సిపల్​ అన్నారు. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం, గోళ్లలో ఉన్న మట్టిని ఎప్పటికప్పడు తీసేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

కరోనా వైరస్​పై నాటక ప్రదర్శన

ఇదీ చూడండి :ఎడ్లబండ్లకు కూడా రేడియం స్టిక్కర్స్ అంటించుకోవాలి..

ABOUT THE AUTHOR

...view details