డ్రైనేజీ వ్యవస్థపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని భాజపా నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే... హైదరాబాద్ వ్యాప్తంగా ఏవిధంగా ఉంటుందో అర్థంచేసుకోవచ్చని విమర్శించారు.
'డ్రైనేజీ సమస్యను పట్టించుకోండి' - లీలానగర్లో పొంగుపొర్లుతున్న డ్రైనేజీ
నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా తయారైందని భాజపా నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. హైదరాబాద్ లీలానగర్లోని తన నివాసం వద్ద రోడ్డుపై పారుతున్న డ్రైనేజీ మురుగు నీటి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
'డ్రైనేజీ సమస్యను పట్టించుకోండి'
తమ కాలనీలో పొంగి పొర్లుతున్న డ్రైనేజీని స్థానికులతో కలిసి పరిశీలించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దాలని కోరారు.