తెలంగాణ

telangana

ETV Bharat / state

Ramineni Foundation Awards: భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లకు విశిష్ట పురస్కారం - Ramineni Foundation Awards

2021 సంవత్సరానికి డాక్టర్ రామినేని ఫౌండేషన్ పురస్కారాలను ప్రకటించింది. త్వరలోనే వీటిని అందించనున్నట్లు రామినేని ఫౌండేషన్​ కన్వీనర్​ పాతూరి నాగభూషణం వెల్లడించారు.

Ramineni Foundation Awards
Ramineni Foundation Awards

By

Published : Nov 6, 2021, 2:37 PM IST

డాక్టర్ రామినేని ఫౌండేషన్ పురస్కారాలు

2021 ఏడాది పురస్కారాలను డాక్టర్ రామినేని ఫౌండేషన్ ప్రకటించింది. కరోనా వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని రామినేని ఫౌండేషన్​ కన్వీనర్​ పాతూరి నాగభూషణం తెలిపారు. దీంతో గతేడాది అవార్డులు ప్రకటించినా.. ప్రదానోత్సవ సభ నిర్వహించలేకపోయామన్నారు. ఈ ఏడాది అవార్డులతో పాటు.. గతేడాది అవార్డులను కూడా ఒకే వేదికపై ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. 32 రంగాలకు చెందినవారిని.. న్యాయ నిర్ణేతలు అవార్డులకు ఎంపిక చేశారన్నారు.

2021 రామినేని ఫౌండేషన్​ అవార్డులు..

  • విశిష్ట పురస్కారం: భారత్ బయోటిక్ వ్యవస్థాపకులు డాక్టర్‌ కృష్ణా ఎల్ల, భారత్ బయోటిక్ జాయింట్ ఎండీ సుచిత్రా ఎల్ల
  • విశేష పురస్కారం: సినీ నటులు కె. బ్రహ్మానందం, నిమ్స్ ప్రొఫెసర్, అనస్థీషియా విభాగ అధిపతి డాక్టర్ దుర్గా పద్మజా, తెలుగు సినిమా పాత్రికేయులు యస్.వి. రామారావు

కుటుంబ సభ్యులే సొంత ఖర్చుతో ఈ అవార్డులను అందచేస్తున్నారని పాతూరి నాగభూషణం తెలిపారు. ఎక్కడా పైసా విరాళం తీసుకోకుండా అవార్డులు అందజేయడం విశేషమన్నారు. 1999లో రామినేని ఫౌండేషన్​ను ఏర్పాటు చేసి, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 330మందికి రూ.5 వేల చొప్పున స్కాలర్‌షిప్​లు ఇస్తున్నామని.. మంచి ఫలితాలు తెచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అవార్డులు అందజేస్తున్నామన్నారు. 150 ప్రభత్వ పాఠశాలలకు ఫౌండేషన్ ద్వారా అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు నాగభూషణం తెలిపారు.

ఇదీ చదవండి:జలవిహార్​లో రామినేని ఫౌండేషన్‌ వార్షికోత్సవ వేడుకలు

పీవీ సింధు, గోరటిలకు 2019 రామినేని పురస్కారాలు

ABOUT THE AUTHOR

...view details