కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పేద ప్రజల సంక్షేమానికి కేంద్ర సర్కారు కృషి చేస్తోందని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. అందులో భాగంగానే 20 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిదని పేర్కొన్నారు. పేదల అభ్యున్నతి కోసం నిరంతం ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ పక్షాలు చేస్తున్న విమర్శలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు.
పేద ప్రజల సంక్షేమానికి కేంద్రం కృషి చేస్తోంది: లక్ష్మణ్ - భాజపా రక్తదాన శిబిరం
లాక్డౌన్ సమయంలో పేద ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్న కేంద్ర ప్రభుత్వం పై కొన్ని రాజకీయపక్షాలు విమర్శలు చేయడం సమంజసం కాదని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ విచారం చేశారు.

Hyderabad latest news
భాజపా జాతీయ అధ్యక్షుడు పిలుపుమేరకు ముషీరాబాద్ నియోజకవర్గ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలో తలసేమియా వ్యాధిగ్రస్తులు రక్తం కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రక్తదానం చేసిన యువ మోర్చా కార్యకర్తలను అభినందించారు. పార్టీ కార్యకర్తలు బడుగు బలహీన వర్గాల ప్రజలకు నిత్యావసర సరుకులతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి సేవ చేస్తున్నారని తెలిపారు.