అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు డాక్టర్‌బాబు జగ్జీవన్ రామ్ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొనియాడారు. ఆయన 114వ జయంతి సందర్భంగా జగ్జీవన్‌రామ్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నట్లు భట్టి తెలిపారు.
'పీడిత వర్గాల కోసం నిరంతరం శ్రమించిన యోధుడు' - bhatti vikramarka about jag Jeevan raam
డాక్టర్‌బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన సేవలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొనియాడారు.
ఆ మహానీయుడి ఉన్నతమైన నాయకత్వం, వ్యక్తిత్వం దేశ ప్రజాస్వామిక వ్యవస్థకు, అణగారిన వర్గాలకు ఎంతో ఊతం ఇచ్చాయని వివరించారు. గొప్ప మేధాశక్తి, స్థిరమైన సంకల్పబలం, కార్యదక్షత కలిగిన వ్యక్తి జగ్జీవన్ రామ్ అని పేర్కొన్నారు. అంటరానితనం నిర్మూలన కోసం ఆయన చేసిన పోరాటాలు ఇప్పటితరానికి ఆదర్శప్రాయంగా నిలుస్తాయన్నారు. ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న...పీడిత దళిత జనులకోసం జీవితాంతం శ్రమించిన సంస్కరణల యోధుడని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:రేపు సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన