తెలంగాణ

telangana

ETV Bharat / state

"నా బిడ్డను నాకు తెచ్చివ్వండి !?" డీజీపీని నిలదీసిన మహిళ - ఎల్జీ పాలిమర్స్ వద్ద గ్రామస్థుల ఆందోళన

రాత్రి తనతో పాటే.. పడుకున్న తన చిన్నారి తల్లి.. తెల్లారేసరికి కనుమరుగైపోయింది. పాపకు ఏ సమస్యా లేదు. తప్పు తమది కాదు. ఎవరు చేసిన పాపమో.. తన పాపను బలితీసుకుంది. ఏపీలోని విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో 9 ఏళ్ల గ్రీష్మ చనిపోయింది. అపస్మారక స్థితికి చేరిన తల్లికి నిన్న మధ్యాహ్నమే విషయం తెలిసింది. జరిగిన దారుణం తెలుసుకున్న ఆ తల్లి గుండె ఒక్కసారిగా మండింది.. నిన్నటి నుంచి రగిలిపోతున్న ఆమె... అడ్డంకులను దాటుకు వచ్చి మరీ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్​ను నిలదీసింది. ఆ వెంటనే "మీ కాళ్లు పట్టుకుంటాం. నాకు న్యాయం చేయండి" అంటూ ఆ తల్లి పడిన కన్నీటి వేదన చూసి ప్రతి ఒక్కరూ చలించిపోయారు.

డీజీపీ
"నా బిడ్డను నాకు తెచ్చివ్వండి !?" డీజీపీని నిలదీసిన మహిళ

By

Published : May 9, 2020, 6:58 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ నగరంలో హానికారక స్టైరీన్ వాయువు లీకై 12 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థను రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ సందర్శించినప్పుడు ఓ సంఘటన జరిగింది. డీజీపీ అక్కడకు వచ్చిన సమయంలో బాధితులంతా... పరిశ్రమ వద్దకు వచ్చారు. జరిగిన అన్యాయంపై గేటు వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. డీజీపీ లోపల ఉండటంతో పోలీసులు బందోబస్తును కట్టుదిట్టం చేశారు.

అయితే ఈ దుర్ఘటనలో కన్నబిడ్డను పోగొట్టుకున్న ధన... కోపంతో రగిలిపోయింది. గేట్లను దూకి లోపలకు దూసుకొచ్చింది. ఆ తల్లి ఆవేశాన్ని గుర్తించిన పోలీసులు సైతం మిన్నకుండిపోయారు. కంపెనీ చేసిన తప్పునకు... బిడ్డను పోగొట్టుకున్నానని... తనకు ఎవరు న్యాయం చేస్తారని డీజీపీని ప్రశ్నించింది. ఆయన కాళ్ల మీద పడుతూ... తన బిడ్డను తనకు తెచ్చివ్వమని రోదించింది. ఆమె బాధను చూసిన వారంతా... చలించిపోయారు. గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో ధన కుమార్తె... తొమ్మిదేళ్ల గ్రీష్మ మృతి చెందింది.

"నా బిడ్డను నాకు తెచ్చివ్వండి !?" డీజీపీని నిలదీసిన మహిళ

కరోనా పరీక్షల్లో రాష్ట్రానికి అగ్రస్థానం: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details