హైదరాబాద్ నాంపల్లి కట్టెలమండిలో నిర్మిస్తున్న రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు చేస్తున్న దీక్ష మూడోరోజుకు చేరింది. బుధవారం వారి దీక్షకు అఖిలపక్ష నాయకులు సంఘీభావం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం గత నాలుగేళ్లుగా చేపడుతున్నా పూర్తి చేయకపోవడంపై అఖిలపక్షం నేతలు మండిపడ్డారు.
'రెండు పడక గదుల ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి' - double bedroom victims protest at nampally hyderabad
హైదరాబాద్ నాంపల్లి కట్టెలమండిలో రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారులు చేస్తున్న దీక్ష మూడో రోజుకు చేరుకుంది. 2016 ఇళ్ల నిర్మాణానికి హామీ ఇచ్చారని.. ఇప్పటికైనా త్వరగా పూర్తి చేయాలని వారి దీక్షకు సంఘీభావం తెలిపిన అఖిల పక్ష నేతలు డిమాండ్ చేశారు.

'రెండు పడక గదుల ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి'
2016 రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీతో లబ్ధిదారులంతా కిరాయి ఇళ్లలో ఉంటున్నారని.. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో వారికి ఉపాధిలేక అద్దె కట్టలేక నానా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.