Double Bedroom Houses Distribution in Hyderabad : గ్రేటర్ హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను (2BHK Distribution in GHMC).. వివిధ ప్రాంతాల్లో మంత్రులు ప్రారంభించారు. ఒక్కొక్క నియోజకవర్గంలో లబ్ధిదారులను ఎంపిక చేసి.. కొంతమంది లబ్ధిదారులకు మంత్రుల సమక్షంలో ఇండ్ల పట్టాలను అందజేశారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సమాచార శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ స్పీకర్ పద్మారావులు.. వివిధ ప్రాంతాల్లో ఎంపిక చేసిన 11,700 రెండు పడక గదుల ఇండ్లను ప్రారంభించారు.
2BHK Inauguration in Hyderabad : 'కళ్లుండి కూడా.. కొందరు చూడలేకపోతున్నారు'
ఇళ్లను లాటరీ ద్వారా కేటాయింపు చేశామని ఎన్ఐసీ సాంకేతికత సహాయంతో.. ఇండ్ల కేటాయింపులు చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బహదూర్‌పల్లిలో జరిగిన.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల (Double Bedroom Houses in Hyderabad) పంపిణీ కార్యక్రమంలో గాజులరామారం, బహదూర్‌పల్లి, డి-పోచంపల్లి ప్రాంతాలకు చెందిన మొత్తం 1,700 గృహాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఇందులో గాజుల రామారంలో నిర్మించిన 144 ఇండ్లు.. బహదూర్‌పల్లిలో నిర్మించిన 356 గృహాలను.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 500 మందికి పంపిణీ చేస్తారు.
డి-పోచంపల్లిలో నిర్మించిన 1,200 గృహాలు..
- సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి- 200
- సనత్‌నగర్ నియోజకవర్గానికి- 500
- కూకట్పల్లి నియోజకవర్గానికి- 500
- మొత్తం 1700 మంది లబ్ధిదారులకు ఇళ్లను మరో పది రోజల్లో పంపిణీ చేయనున్నారు.
మంఖాల్-1 లోకేషన్లో నిర్మించిన 2,230 ఇండ్లను.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అందులో మంఖాల్-1లో నిర్మించిన 500 ఇళ్లను మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.
మాంఖాల్-2 లో నిర్మించిన 1,730 గృహాలను వివిధ నియోజకవర్గాలకు కేటాయించారు.
- మలక్‌పేట నియోజకవర్గానికి- 500
- చార్మినార్ నియోజకవర్గానికి- 500
- యాకత్పురా నియోజకవర్గానికి- 500
- చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి- 230
- మొత్తం 1730 మంది లబ్ధిదారులకు మరో పదిరోజుల్లో పంపిణీ చేయనున్నారు.