తెలంగాణ

telangana

ETV Bharat / state

డబుల్‌ బెడ్​రూం ఇళ్లు ఇస్తామంటూ మోసం - రెండు పడకగదుల ఇళ్ల పథకం

డబుల్‌ బెడ్​రూం ఇళ్లను ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టకున్నారు. ఇప్పటి వరకు 17 మంది నుంచి సుమారు 20 లక్షల వరకు మోసం చేసినట్లు అధికారులు తెలిపారు.

Double bedroom houses are cheating person arrested at hyderabad
డబుల్‌ బెడ్​రూం ఇళ్లు ఇస్తామంటూ మోసం

By

Published : Jun 13, 2020, 9:16 AM IST

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడకగదుల ఇళ్ల పథకంలో ఇళ్లు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న రాకేష్‌యాదవ్‌ అనే వ్యక్తిని ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు 17 మందిని మోసం చేసినట్లు పోలీసలు గుర్తించారు.

ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.80 వేల నుంచి లక్షా యాభై వేల వరకు వసూలు చేసినట్లు గుర్తించారు. ఒక అధికారిగా చలామణి అవుతూ తనకి వివిధ జిల్లాల కలెక్టర్లతో సంబంధం ఉందంటూ నమ్మబలికి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటి వరకు 20 లక్షలు మోసం చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అబిడ్స్‌ పోలీసులకు అప్పగించారు.

ఇదీ చూడండి :అమానుషం: చెత్త బండిలో మృతదేహం తరలింపు

ABOUT THE AUTHOR

...view details