హైదరాబాద్ అబిడ్స్ కట్టెల మండిలో రెండు పడకగదుల పట్టాల కేటాయింపు పత్రాలను లబ్దిదారులకు అధికారులు అందజేశారు. సోమవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించిన అనంతరం కొంతమంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వగా రానివారు సోమవారం సాయంత్రం రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.
'లక్కీ డ్రా తీశారు.. గొడవ సద్దుమణిగింది' - Minister KTR latest news
కట్టెల మండిలో మంత్రి కేటీఆర్ రెండు పడకగదుల ఇళ్లను ప్రారంభించారు. కొంతమంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వగా రానివారు సోమవారం సాయంత్రం రోడ్డుపై ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం రాత్రి లక్కీ డ్రా ద్వారా ఇళ్లను కేటాయించారు.
'లక్కీ డ్రా తీశారు.. గొడవ సద్దుమణిగింది'
విషయం తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం రాత్రి లక్కీ డ్రా ద్వారా ఇళ్లను కేటాయించారు. మళ్లీ ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసుల సమక్షంలో సంబంధిత అధికారులు 103 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పత్రంతో పాటు తాళం కీ ఇచ్చారు.
ఇదీ చూడండి:నాయిని సతీమణి మృతి పట్ల ప్రముఖుల సంతాపం