తెలంగాణ

telangana

ETV Bharat / state

Dost: మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాలు... దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్ - Dosth notification relesed

జులై 1 నుంచి డిగ్రీ ఆన్​లైన్ ప్రవేశాల (Degree Online Entrance) ప్రక్రియ ప్రారంభం కానుంది. మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాలు పూర్తి చేసేలా దోస్త్ నోటిఫికేషన్ (Dost Notification) విడుదలైంది. రాష్ట్రంలోని ఆరు విశ్వవిద్యాలయాల పరిధిలోని 1,060 కళాశాలల్లో సుమారు 4 లక్షల 25వేల డిగ్రీ సీట్లను దోస్త్ ద్వారా భర్తీ చేయనున్నారు. సెప్టెంబరు 1 నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.

dosth
దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్

By

Published : Jun 29, 2021, 8:01 PM IST

డిగ్రీ ఆన్​లైన్ ప్రవేశాల (Degree Online Entrance) కోసం ఉన్నత విద్యా మండలి దోస్త్ (Dost) ప్రకటన జారీ చేసింది. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి, కళాశాల విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, దోస్త్ కన్వీనర్ లింబాద్రి నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని 1,060 కళాశాలల్లోని బీఏ, బీకాం, బీఎస్సీ తదితర సంప్రదాయ డిగ్రీలో దాదాపు 4 లక్షల 25 వేల సీట్లను భర్తీ చేయనున్నారు.

మూడు విడతల్లో ప్రవేశాలు...

జులై 1 నుంచి మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ చేపట్టేలా షెడ్యూలు రూపొందించారు. జులై 1 నుంచి 15 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లు జరుగుతాయని దోస్త్ కన్వీనర్ ఆచార్య లింబాద్రి తెలిపారు. ఇంటర్ పూర్తయిన విద్యార్థులు రూ. 200 చెల్లించి ఆధార్​తో అనుసంధానమైన మొబైల్ ఫోన్ ద్వారా దోస్త్ వెబ్​సైట్​లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. టీఎస్ యాప్ ఫోలియో ద్వారా లేదా యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని సహాయ కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని లింబాద్రి తెలిపారు.

వెబ్ ఆప్షన్లు...

రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన విద్యార్థులు.. జులై 3 నుంచి 16 వరకు కాలేజీలు, కోర్సులను ఎంచుకొని వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. ఎన్​సీసీ, క్రీడలు, దివ్యాంగులు తదితరులకు జులై 13, 14న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. జులై 22న డిగ్రీ మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. సీటు పొందిన అభ్యర్థులు జులై 23, 24 తేదీల్లో ఆన్​లైన్​లో కళాశాలలకు రిపోర్ట్ చేయాలి. మిగిలిన సీట్ల భర్తీ కోసం జులై 23 నుంచి రెండో విడత ప్రక్రియ ఉంటుందని లింబాద్రి తెలిపారు.

సెప్టెంబర్ 1 నుంచి...

మొదటి విడతలో రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులు రూ. 400 ఫీజు చెల్లించి జులై 23 నుంచి 27 వరకు రెండో విడతలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జులై 24 నుంచి 29 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్లు స్వీకరించి.. ఆగస్టు 4న సీట్లు కేటాయిస్తారు. ఆగస్టు 5 నుంచి 10 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుందని లింబాద్రి తెలిపారు. ఆగస్టు 6 నుంచి 11 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్లు స్వీకరించి.. ఆగస్టు 18న సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబరు 1 నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించనున్నట్లు దోస్త్ కన్వీనర్ వెల్లడించారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో 97.24 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు

ABOUT THE AUTHOR

...view details