డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల (Degree Online Services Telangana) ప్రక్రియ షెడ్యూలును సవరించారు. మొదటి విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువును మరోసారి పొడిగించారు. ఈనెల 28 వరకు పొడిగించినట్లు దోస్త్ కన్వీనర్ ఆచార్య లింబాద్రి (Dost Convenor Prof. Limbadri) తెలిపారు.
DOST: దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు మరోసారి పొడిగింపు - degree online entrance
18:34 July 24
DOST: దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్లు మరోసారి పొడిగింపు
ఆగస్టు 4న డిగ్రీ మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు. ఆగస్టు 5 నుంచి 18 వరకు రెండో విడత దోస్త్ (DOST) రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉన్నట్లు దోస్త్ కన్వీనర్ ఆచార్య లింబాద్రి పేర్కొన్నారు. ఆగస్టు 25న రెండో విడత డిగ్రీ సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.
ఇవాళ్టి వరకు 1.88లక్షల మంది దోస్త్ రిజిస్ట్రేషన్లు, 1.56 లక్షల మంది వెబ్ ఆప్షన్లు చేసుకున్నారని స్పష్టంచేశారు. ఆధార్ అనుసంధాన మొబైల్ ద్వారా లేదా మీసేవ కేంద్రాలు, టీఎస్ యాప్ ఫోలియోతో పాటు.. 105 సహాయ కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని లింబాద్రి తెలిపారు.
ఇవీ చూడండి: