రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల కోసం ఉన్నత విద్యా మండలి ప్రకటన జారీ చేసింది. ఆధార్ అనుసంధాన మొబైల్ నెంబర్‌తో అప్లై చేసుకోవచ్చని దోస్త్ కన్వీనర్ ఆచార్య లింబాద్రి తెలిపారు. ఫేస్ రికగ్నైజేషన్ విధానంలోనూ దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉందన్నారు. ఈ ఏడాది డిగ్రీలో కొత్తగా పలు కోర్సులు ప్రారంభమయ్యాయని అన్నారు.
'విద్యార్థులు ఆందోళన వద్దు.. మూడు దశల్లో ప్రవేశాలు'
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు పూర్తి చేసిందని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి పేర్కొన్నారు. ఆధార్ అనుసంధాన మెుబైల్ ఫోన్‌తో ఎక్కడకు వెళ్లకుండానే ప్రవేశాల ప్రక్రియ చేయవచ్చని తెలిపారు. ఈ ఏడాది మరికొన్ని నూతన కోర్సులు ప్రవేశాపెట్టామంటున్న దోస్త్ కన్వీనర్‌తో మా ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
'విద్యార్థులు ఆందోళన వద్దు.. మూడు దశల్లో ప్రవేశాలు'
డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్, ఆఫీస్ మేనేజ్ మెంట్, ఫిషరీస్, అగ్రికల్చరల్ ప్రొడక్షన్, డైరీ టెక్నాలజీ నూతన కోర్సులు మొదలుపెట్టామన్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రవేశాల ప్రక్రియ ఏర్పాటు చేశామని వెల్లడించారు. మూడు దశల్లో ప్రవేశాల ప్రక్రియ ఉంటుందన్న లింబాద్రి..విద్యార్థులెవరూ గందరగోళానికి గురికావద్దని సూచించారు.
ఇదీ చూడండి :ఆరడుగుల ఎత్తులో కొలువైన బాలాపూర్ గణేశుడు