ETV Bharat / state
వృథా చేయొద్దు: స్మితా సబర్వాల్ - SHMITHA SABARWAL
మిషన్ భగీరథ నిర్వహణ విధానాలపై హైదరాబాద్‌లో జరుగుతున్న రెండో రోజు సదస్సుకు మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వల్ హాజరయ్యారు.
By
Published : Feb 2, 2019, 3:11 AM IST
| Updated : Feb 4, 2019, 5:54 PM IST
ఎన్నో వ్యయప్రయాసలతో గుమ్మం ముందుకే తాగునీటిని తీసుకొస్తున్నామని... జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలిపారు. మిషన్ భగీరథ నిర్వహణ విధానాలపై హైదరాబాద్‌లో జరుగుతున్న రెండో రోజు సదస్సులో స్మితా పాల్గొన్నారు. వాటర్ ఆడిట్, ఎనర్జీ ఆడిట్, నిర్వహణ పద్ధతులపై చర్చించారు. ఈ పథకంలో వెలకట్టలేని ఆరోగ్యనిధిని భావితరాలకు ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. రోజువారీ నీటి వినియోగం, లీకేజీలను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో సమర్థవంతంగా లెక్కపెట్టవచ్చన్నారు. మిషన్ భగీరథ బేస్ లైన్ సర్వేపై యూనిసెఫ్ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు. Last Updated : Feb 4, 2019, 5:54 PM IST