రైల్వే స్వచ్ఛత పక్వడా నినాదంతో రైల్వే అధికారులు రెండు వారాలుగా దేశ వ్యాప్తంగా పరిశుభ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో శుభ్రత, ప్లాస్టిక్‌పై నిషేధం, తదితర అంశాలను పరిశీలించనున్నారు. హైదరాబాద్‌లోని పాతబస్తీ, ఉప్పుగూడ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హైదరాబాద్ రైల్వే ఉన్నతాధికారి ఎన్ఎస్ఆర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీహెచ్ఎంసీ, ఐటీసీతో సహా స్థానిక వాలంటీర్లతో కలిసి స్టేషన్ సమీప ప్రాంతంలోని చెత్తను తొలగించారు. చెత్తను రైల్వే స్టేషన్ సమీపంలోని రోడ్లపై వేయకూడదని నివాసం చుట్టూ ఉన్న స్థానికులకు సూచించారు. అనంతరం ప్లాస్టిక్‌ను వినియోగించొద్దని అవగాహన కల్పించారు.
'రైల్వే స్టేషన్ సమీప రోడ్లపై చెత్తను వేయకూడదు' - రైల్వే అధికారులు
స్వచ్ఛత, పరిశుభ్రతపై దేశవ్యాప్త కార్యక్రమాన్ని రైల్వే శాఖ చేపట్టింది. రెండు వారాల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమం ముగింపు దశకు వచ్చిందని హైదరాబాద్ రైల్వే డీఆర్ఎం ప్రసాద్ తెలిపారు.
!['రైల్వే స్టేషన్ సమీప రోడ్లపై చెత్తను వేయకూడదు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4585177-thumbnail-3x2-railway.jpg)
రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి : హైదరాబాద్ డీఆర్ఎం
రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి : హైదరాబాద్ డీఆర్ఎం
ఇవీ చూడండి : యురేనియం అన్వేషణ జీవోను రద్దు చేయాలి :వీహెచ్