తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్మీడియట్​ పరీక్ష ఫీజుకు లింక్​ పెట్టొద్దు : బోర్డు - ఇంటర్ పరీక్ష ఫీజుపై బోర్డు ఆదేశాలు

ఇంటర్ పరీక్ష ఫీజుతో బోధన రుసుముకు ఎలాంటి సంబంధం లేదని హైదరాబాద్​ నాంపల్లిలోని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ప్రకటించింది. ఎలాంటి షరతులు లేకుండా పరీక్ష రుసుమును వసూలు చేయాలని కళాశాలల ప్రధానోపాధ్యాయులకు ఉత్తర్వులు జారీ చేసింది.

dont Link to Intermediate Exam Fees with tution fee declared by intermediate board
ఇంటర్మీడియట్​ పరీక్ష ఫీజుకు లింక్​ పెట్టొద్దు : బోర్డు

By

Published : Feb 6, 2021, 8:22 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజుకు బోధన రుసుముతో ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. బోధన రుసుములతో లింక్ లేకుండా పరీక్ష ఫీజును తీసుకోవాలని కళాశాలల ప్రధానోపాధ్యాయులకు పరీక్షల నియంత్రణాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

పరీక్షల ఫీజును ఎలాంటి షరతులు లేకుండా అంగీకరించాలని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బోర్డు ఇచ్చినా ఉత్తర్వులను పాటించని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్​ బోర్డు అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి :నల్గొండ జిల్లాలో ఎత్తిపోతల పథకాలకు సర్కారు అనుమతి

ABOUT THE AUTHOR

...view details