తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫీజులు పెంచితే పోరాటం చేస్తాం: ఎన్‌ఎస్‌యూఐ - ఫీజులు పెంచితే పోరాటం చేస్తాం: ఎన్‌ఎస్‌యూఐ

విద్యార్థులపై అధిక ఫీజుల భారం మోపితే ప్రభుత్వంతో పోరాటం చేస్తామని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ హెచ్చరించారు. కాంగ్రెస్‌ హయాంలో కంటే తెరాస పాలనలో ఇంజినీరింగ్ ఫీజులు పెరిగాయని ఆరోపించారు.

ఫీజులు పెంచితే పోరాటం చేస్తాం: ఎన్‌ఎస్‌యూఐ

By

Published : Jul 4, 2019, 5:10 PM IST

కాంగ్రెస్‌ హయాంలో కంటే తెరాస పాలనలో ఇంజినీరింగ్ ఫీజులు పెరిగాయని ఎన్‌ఎస్‌యూఐ నేతలు ఆక్షేపించింది. కొంతమంది రాజకీయ నాయకులకు కాలేజీలు ఉన్నందున టీఎఫ్‌ఆర్‌సీపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ఆరోపించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా ఫీజులు మాత్రం పెంచుతున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. కౌన్సెలింగ్​ జరుగుతుండగానే కాలేజీలు డొనేషన్లు గుంజుతున్నాయని దుయ్యబట్టారు. విద్యార్థులపై అధిక ఫీజుల భారాన్ని పెంచితే ఎన్‌ఎస్‌యూఐ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

ఫీజులు పెంచితే పోరాటం చేస్తాం: ఎన్‌ఎస్‌యూఐ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details