వరదల వంటి పరిస్థితుల్లో రైళ్ల భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడొద్దని రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అధికారులకు సూచించారు. డీఆర్ఎం అధికారులతో దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం సమయంలో రైళ్లను సాఫీగా నడపటానికి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా రైళ్ల వంతెనలు, సొరంగాల వద్ద పటిష్ఠమైన నిఘా ఉంచాలని అన్నారు. సిగ్నల్ సమస్యలు, ఇంజినీరింగ్ వైఫల్యాలను ముందస్తుగా గుర్తించి సరిచేయాలని పేర్కొన్నారు. రైళ్ల సమయపాలనను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాననీ.. షెడ్యూల్ ప్రకారం రైళ్లను నడిపిందేకు తమ శాయశక్తులా కృషి చేస్తున్నామని తెలిపారు.
రైళ్ల భద్రత విషయంలో రాజీపడొద్దు: గజానన్ మాల్య - Ghazanan Mallya
డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) అధికారులతో రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. రైళ్ల భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడొద్దని అధికారులకు సూచించారు.
రైళ్ల భద్రత విషయంలో రాజీపడొద్దు: గజానన్ మాల్య