ఆర్టీసీ కార్మికుల సమ్మె 47వ రోజుకు చేరింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులకు జీతాలు రాక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వారి పరిస్థితులు గమనించి కొందరు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పేద ఆర్టీసీ కార్మికులకు నిత్యావసర సరుకులు, బియ్యం, వంట సామగ్రి అందజేశారు. గత 47 రోజులుగా కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల ప్రభుత్వ మొండి వైఖరి విడనాడి చర్చలకు ఆహ్వానించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
ఆర్టీసీ కార్మికులకు నిత్యావసరాల పంపిణీ - నిత్యావసర సరుకులు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ వద్ద 47 రోజుల నుంచి సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు అవస్థలు చూసి కొంతమంది దాతలు స్వచ్ఛందంగా వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఆర్టీసీ కార్మికులను ఆదుకున్న దాతలు