ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా పలువురు దాతలు దాదాపు 6 కోట్ల 80 లక్షలు రూపాయలు విరాళంగా ఇచ్చారు. విజ్ స్తిరాస్థి ప్రతినిధులు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ల ఆధ్వర్యంలో కోటి రూపాయల చెక్కుని కేటీఆర్‌కి అందించారు. ఏన్సైరా మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున తెరాస నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి కోటి రూపాయల చెక్కును ఇచ్చారు.
సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు - Donations CMRF
కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వానికి సహకరించేందుకు వివిధ రంగాల వారు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే రాజకీయ నాయకులు, వ్యాపారులు, సినీనటులు విరాళాల రూపంలో సీఎం సహాయనిధికి డబ్బులు అందించారు. తాజాగా దాతలు రూ. 6.80 కోట్లను విరాళంగా ఇచ్చారు.
విరాళాలు
నిధులిచ్చిన దాతల వివరాలు
- పెన్నా సిమెంట్స్ సంస్థ రూ. కోటి
- రత్నదీప్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. కోటి
- జెమిని ఈడిబుల్స్ అండ్ ప్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.50 లక్షలు
- పీఓటీ మార్కెట్ స్వర్ణకారులు రూ. 32లక్షలు
- దొడ్ల డైరీ లిమిటెడ్ రూ. 25 లక్షలు
- ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ రూ. 25 లక్షలు
- వశిష్ట కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 25 లక్షలు
- గాయత్రి గ్రానైట్స్ రూ. 25 లక్షలు
- అగ్రసేన్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రూ. 21 లక్షలు
- నీరూస్ ఏన్‌సెంబుల్స్ రూ. 20లక్షలు
- రిజెనెసిస్ ఇండస్ట్రీస్ సంస్థ రూ.10 లక్షలు
ఇదీ చూడండి:కరోనా కోసమని ఆ మాత్ర వాడితే చూపు తగ్గుతుంది!