తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం సహాయ నిధికి వెల్లువెత్తిన సినీ ప్రముఖుల విరాళాలు - CM RELIEF SUND

కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తాయి. ఈ మేరకు హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో 25 లక్షల రూపాయలను అందజేశారు. పలువురు నటులు తమ శక్తి మేరకు విరాళాలు ఇచ్చారు.

సీఎం సహాయ నిధికి ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌ విరాళం
సీఎం సహాయ నిధికి ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌ విరాళం

By

Published : Apr 8, 2020, 8:48 PM IST

కరోనా బాధితుల సహాయార్థం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఆసరాగా నిలిచేందుకు హైదరాబాద్ ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల విరాళం అందజేసింది. ఈ మేరకు ఎఫ్‌ఎన్‌సీసీ ప్రెసిడెంట్‌ ఆదిశేష గిరిరావు, సెక్రటరి కేఎస్‌ రామారావు, సంస్థ వ్యవస్థాపకులు, జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌ కాజా సూర్యనారాయణ, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ రామ్మోహన్‌రావు సంయుక్తంగా ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను కలిశారు. అనంతరం చెక్‌ అందజేశారు.

సినీ కార్మికుల సంక్షేమం కోసం అమర్ రాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మాత పద్మావతి రూ. 10 లక్షల రూపాయలను అందజేశారు. సీసీసీకి నటుడు సాయికుమార్‌, తనయుడు ఆది కలిపి 5 లక్షల 4 రూపాయలు విరాళంగా ఇచ్చారు. డబ్బింగ్‌ యూనియన్‌కు మరో 2 లక్షల 8 రూపాయలు విరాళం అందజేశారు. సాయికుమార్‌ సోదరుడు రవిశంకర్‌ లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు. సినీ నటుడు ఆర్‌ సాగర్‌ 5 లక్షల రూపాయలను మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.

ఇవీ చూడండి : కరోనాపై పోరుకు కొత్త సైన్యం- ఆన్​లైన్​లో శిక్షణ!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details