కరోనా బారిన పడిన వారిని ఆదుకునేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. తమ వంతుగా ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నాయి. దీనిలో భాగంగా టెరేడా, భూమి స్థిరాస్తి సంస్థలు వేర్వేరుగా మొత్తం 20 లక్షల రూపాయలను సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు విరాళంగా అందజేశారు.
కొవిడ్ బాధితులకు బాసటగా.. పలు సంస్థల విరాళాలు - హైదరాబాద్ తాజా వార్తలు
కరోనా బాధితులకు ఆదుకునేందుకు పలు సంస్థలు తమవంతు సహకారాన్ని అందిస్తున్నాయి. ట్రెడా, భూమి స్థిరాస్తి సంస్థలు వేర్వేరుగా 20 లక్షల రూపాయలను సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు విరాళంగా అందజేశారు.
కొవిడ్ బాధితులకు బాసటగా సంస్థల విరాళాలు
మీనాక్షి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ తరఫున ట్రెడా అధ్యక్షుడు విజయ్ సాయి మేక రూ.10 లక్షలు, దేవ్ భూమి స్థిరాస్తి సంస్థ సంచాలకుడు పీయూష్ అగర్వాల్ 10 లక్షల రూపాయల చెక్కును... సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు అందజేశారు. కొవిడ్ బాధితులకు బాసటగా నిలుస్తున్న సంస్థలను సీపీ అభినందించారు.
ఇదీ చదవండి:బిగ్‌బీకి కరోనా టీకా రెండో డోసు