Donations Tension in Traders at Telangana Elections :తెలంగాణలో ఎన్నికల (Telangana Elections) వేడి రాజుకుంది. మరీ ఎన్నికల్లో నెగ్గాలంటే ఎంతైనా ఖర్చు భరించాల్సిందే. సాధారణంగా పెద్ద పార్టీలకు అధికారికంగానే రూ.వందల కోట్లలో నిధులు ఉంటాయి. ఆ డబ్బునే పార్టీ కార్యక్రమాల కోసం వినియోగిస్తుంటాయి. చిన్న పార్టీలు, కిందిస్థాయి నేతలకే నిధుల కొరత ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరు ర్యాలీలు చేయాలన్నా.. సమావేశాలు నిర్వహించాలన్నా స్థానిక వ్యాపారులను ఆశ్రయించి చందాలు రాబడుతుంటారు.
ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల పాటలు
Demand of Donations Leaders at Assembly Elections 2023 : ప్రస్తుతం ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో పార్టీ కార్యక్రమాల పేరుతో ఈ వసూళ్లు మితిమీరిపోతున్నాయి. దీంతో వ్యాపారులు హడలిపోతున్నారు. దీనినే అదనుగా తీసుకొని పార్టీలతో సంబంధం లేనివారు కూడా.. అనుబంధ సంఘాల పేరిట గ్రూప్‌లుగా తయారై డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా రోజుకొకరు వచ్చి చందాలు (Demand for Donations) అడుగుతుండటంతో ఎన్నికలు అయ్యే వరకూ ఈ తిప్పలు తప్పేలా లేవని వ్యాపారస్థులు ఆవేదన చెందుతున్నారు. ఒకప్పుడు ఎంతోకొంత ఇస్తే తీసుకెళ్లేవారని.. ఇప్పుడు ఎంత ఇవ్వాలో వారే చెబుతున్నారని.. ఓ వ్యాపారి తన ఆందోళన వెలిబుచ్చారు.
ఓటమితో మొదలెట్టి - ఆపై గెలుపు బండెక్కి, ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోని నేతలెవరో తెలుసా?
కొన్ని సంస్థలే లక్ష్యం :ముఖ్యంగా ఇలా చందాలు వసూలు చేసేవారు.. కొన్ని వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులు, విద్యాసంస్థలు, మద్యం దుకాణాలు, స్థిరాస్తి, నిర్మాణ సంస్థలు, హోటళ్లు, శివార్లలో అయితే వాతావరణ కాలుష్యానికి అవకాశం ఉన్న పరిశ్రమల నిర్వాహకులపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఇటీవల ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లిన.. ఓ చోటా నేత డబ్బు ఇచ్చే వరకూ కదిలేది లేదని అక్కడే కూర్చున్నాడు.