కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు హైదరాబాద్‌లోని యంగిస్తాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా కిట్లను అందించారు. బంజారాహిల్స్ పీహెచ్సీ సెంటర్, గాంధీ హాస్పిటల్, ఆశా వర్కర్లకు పీపీఈ కిట్లను, ఎన్ 95 మాస్కులు, ఆక్సీమీటర్లు, థర్మమీటర్లను, బీపీ మెషిన్లను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేతుల మీదుగా.. ఫౌండేషన్ సభ్యులు పంపిణీ చేశారు.
యంగిస్తాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు కరోనా కిట్ల అందజేత - యంగిస్తాన్ ఫౌండేషన్
యంగిస్తాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఆశా వర్కర్లకు పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు, కరోనా కిట్లను అందించారు. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. పీహెచ్ సీ సెంటర్లలోని వ్యాక్సిన్, ఓపీల విధానాన్ని మేయర్ పరిశీలించారు.
Donation of corona kits to Asha workers of Yangisthan foundation in Hyderabad
మేయర్ పీహెచ్సీ సెంటర్లలోని వ్యాక్సిన్, ఓపీల విధానాన్ని పరిశీలించారు. అనంతరం గాంధీ హాస్పిటల్‌కు వెళ్లి సూపరింటెండెంట్ రాజారావుతో మాట్లాడి, కిట్లను అందజేసి ఆసుపత్రిని సందర్శించారు. యంగిస్తాన్ ఫౌండేషన్‌ను అభినందించిన మేయర్... ఇలాగే అన్ని ఫౌండేషన్లు తమ వంతు సాయం అందించాలని మేయర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Gurukula School: గురుకుల ప్రవేశ పరీక్షలపై సందిగ్ధం