తెలంగాణ

telangana

By

Published : Mar 14, 2021, 4:13 PM IST

ETV Bharat / state

'పాత వస్త్రాలు దానం చేసి మరొకరి గౌరవం కాపాడుదాం'

కొంచం లావైతే చాలు వస్త్రాలు బిగుతు అవుతాయి. పిల్లలకైతే నెల నెలకు పొట్టి అయిపోతుంటాయి. మరి ఆ బట్టలు ఏం చేయాలి? ఇది ఇంటింటా ఉండే సమస్యే. ఆ వస్త్రాలను పేదలకు దానం చేయమంటోంది డొనేట్ వస్త్రా సంస్థ. ఈ మేరకు ఈ రోజు కేబీఆర్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన అవగాహన నడకను ఐటీ సెక్రటరీ జయేశ్​ రంజన్ ప్రారంభించారు.

'పాత వస్త్రాలు దానం చేసి మరొకరి గౌరవం కాపాడుదాం'
'పాత వస్త్రాలు దానం చేసి మరొకరి గౌరవం కాపాడుదాం'

పాత వస్త్రాలను పేదలకు దానం చేయటం వల్ల మరొకరి గౌరవాన్ని కాపాడవచ్చని ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్​ రంజన్‌ అన్నారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌ వద్ద డొనేట్‌ వస్త్రా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నడకలో పాల్గొన్నారు. పేదల కోసం పనిచేస్తున్న ఇలాంటి సంస్థలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి:మహబూబాబాద్​లో తెరాస-వామపక్ష కార్యకర్తల మధ్య ఘర్షణ

ABOUT THE AUTHOR

...view details