Tadikonda YCP politics: ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీలో ఆధిపత్య పోరు రోజురోజుకీ ముదురుతోంది. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో అదనపు ఇంఛార్జ్‌గా ఎమ్మెల్యే డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించడాన్ని నిరసిస్తూ కొద్దిరోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇవాళ కూడా తాడికొండలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి మద్దతుగా ఓ వర్గం ర్యాలీకి సిద్ధమైంది. తాడికొండ కూడలిలో ర్యాలీ ప్రారంభించే సమయంలో అక్కడకు డొక్కా మాణిక్యవరప్రసాద్ వర్గం చేరుకుంది. డొక్కాకు అనుకూలంగా వారు నినాదాలు చేయటంతో అవతలి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే అక్కడికు చేరుకున్న పోలీసులు ... ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. తాడికొండలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అంతర్గత సమావేశాలు నిర్వహించుకోవాలే గానీ.. రోడ్డెక్కి కార్యక్రమాలు వద్దని సూచించారు.
అన్నయ్య ప్రభుత్వంలో ఒకే గూటి పక్షులే కొట్టుకుంటున్నాయి - తెలుగు రాష్ట్రాల రాజకీయాలు
Tadikonda YCP politics ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా పార్టీలో ఆధిపత్యపోరు మరింత ముదురుతోంది. గుంటురు జిల్లా తాడికొండ నియోజకవర్గ వైకాపా అదనపు ఇంఛార్జ్‌గా డొక్కా మాణిక్య వరప్రసాద్ నియామకాన్ని నిరసిస్తూ తాడికొండలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మద్దతుదారులు ర్యాలీకి సిద్ధమయ్యారు. తాడికొండ కూడలిలో ర్యాలీ ప్రారంభించే సమయంలో డొక్కా వర్గం అక్కడికి చేరుకుని డొక్కాకు అనుకూలంగా నినాదాలు చేసింది. ఇరు వర్గాల మోహరింపుతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. తాడికొండలో ఎలాంటి ర్యాలీలకూ అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలీసులు ర్యాలీకి అనుమతిస్తే తామూ రోడ్డెక్కుతామని డొక్కా వర్గం హెచ్చరించింది.
శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని... అందరూ సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అయితే పోలీసులతో కూడా వైకాపా నేతలు వాగ్వాదానికి దిగారు. ముందుగా ఎవరు రెచ్చగొట్టారో వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాలీకి అనుమతించాలని ఎమ్మెల్యే వర్గం సహకార సొసైటీ కార్యాలయం వద్ద బైఠాయించింది. పోలీసులు ర్యాలీకి అనుమతిస్తే తామూ రోడ్డెక్కుతామని డొక్కా వర్గం స్పష్టం చేసింది. ఉద్రిక్తతలు నివారించేందుకు తాడికొండ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గొడవలు జరగకుండా నియంత్రించేందుకు తుళ్లూరు, మంగళగిరి నుంచి కూడా పోలీసులు తాడికొండ చేరుకున్నారు.
ఇవీ చదవండి: