మహిళలపై దాడులు రోజురోజుకు పెరగుతున్నాయి. ఆరేళ్లలో గృహహింస మూడురెట్లయింది. ‘డయల్-100’ ఫోన్‌కాల్స్ విశ్లేషణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ వ్యవస్థకు రోజు వస్తున్న ఫోన్‌కాల్స్‌లో 12 శాతం మహిళలపై వేధింపులు, దాడులకు సంబంధించినవే ఉంటున్నాయి. ఇవి రోజుకు సగటున 450 ఉంటున్నట్లు విశ్లేషించారు. వీటిలో 250 వరకు గృహహింసకు సంబంధించినవే కావడం గమనార్హం. ఇందులో 181 ఫోన్‌కాల్స్‌ను కౌన్సెలింగ్ కోసం బదిలీ చేస్తున్నారు. మహిళలపై దాడులకు సంబంధించి 2016లో 59,000 ఫోన్‌కాల్స్ రాగా.. 2020, నవంబరు నాటికి ఆ సంఖ్య 1,60,000కు చేరడం గమనార్హం. అదేవిధంగా ఉమన్ హెల్ప్‌లైన్(181)కు రోజుకు సగటున 800 కాల్స్ వస్తున్నాయి. వీటిలో 40-45 మాత్రమే అత్యవసరమైనవి. లాక్‌డౌన్ తరవాత ‘181’కు అత్యవసర కాల్స్ పెరిగినట్లు వెల్లడైంది. మూడేళ్లలో (2017,ఆగస్టు నుంచి 2020,నవంబరు వరకు) 13,565 గృహహింస కేసులు నమోదయ్యాయి.
‘డయల్ 100’ ఎలా పనిచేస్తుంది?