కేంద్ర పౌరవిమానాయాన మార్గదర్శకాల ప్రకారం దేశీయ విమనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా శంషాబాద్ విమానాశ్రయంలోనూ దేశీయ విమాన సర్వీసులు మొదలయ్యాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా విమానాశ్రయంలో తీసుకున్న జాగ్రత్తలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పరిశీలించారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి 19 విమానాలు వెళ్తాయని... అంతే సంఖ్యలో ఇక్కడికి వస్తాయని సీఎస్ తెలిపారు. మొత్తం 3,200 మంది రాకపోకలు సాగిస్తారని వివరించారు. ఇక్కడి నుంచి వెళ్లే వారికి... ఇతర నగరాల నుంచి వచ్చే వారికి థర్మల్ స్కానింగ్ ద్వారా పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైరస్ లక్షణాలు ఉంటే పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వస్తేనే క్వారంటైన్‌కు పంపుతామని... లేకపోతే ఇళ్లకు వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు.