తెలంగాణ

telangana

ETV Bharat / state

వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాణిక్య వరప్రసాద్ నేడు నామినేషన్ - ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు 2020 వార్తలు

తన రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. వైకాపా అభ్యర్థిగా ఇవాళ మధ్యాహ్నం ఆయన నామినేషన్‌ వేయనున్నారు.

dokka-manikya-varaprasad-to-file-nomination-as-ycp-mlc-candidate-today
వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాణిక్య వరప్రసాద్ నేడు నామినేషన్

By

Published : Jun 25, 2020, 11:02 AM IST

ఆంధ్రప్రదేశ్​లో ఎమ్మెల్సీ సభ్యత్వంతో పాటు తెలుగుదేశానికి రాజీనామా చేసి అధికార పార్టీ పంచన చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌నే మళ్లీ శాసన మండలికి పంపాలని వైకాపా నిర్ణయించింది. డొక్కా రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని మళ్లీ ఆయనతోనే భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

ఎమ్మెల్సీ ఎన్నికకు నేటితో నామినేషన్లు ముగియనున్న వేళ డొక్కా అభ్యర్థిత్వాన్ని జగన్‌ ఖరారు చేశారు. ఈ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నామినేషన్‌ వేయనున్నారు. డొక్కాకు మద్దతుగా పలువురు వైకాపా ఎమ్మెల్యేలు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పోటీపై ఇంకా నిర్ణయం ప్రకటించని తెలుగుదేశం... తగినంత సంఖ్యాబలం లేనందున దూరంగా ఉంటే డొక్కా ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

ఇదీచూడండి: డీసీసీబీల్లో రూ.600 కోట్లకు పైగా పేరుకుపోయిన బకాయిలు

ABOUT THE AUTHOR

...view details