ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇంకా ప్రకటనే వెలువడలేదు. కానీ.. అప్పుడే రకరకాల ఎన్నికల సిత్రాలు బయటపడున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అధికారుల నిర్వాకం.. నిర్లక్ష్యానికి చిరునామాగా నిలిచింది. ఓటరు జాబితాలో కుక్క, పువ్వులనూ చేర్చిన వారి పనితీరు.. విమర్శల పాలవుతోంది.
చిత్రాలు విచిత్రాలు: కుక్కలు, పువ్వులకు ఓటక్కు! - ఓటరు జాబితాలో కుక్కలు, పువ్వుల బొమ్మలు
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఓటరు జాబితాలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం.. ప్రజల ఆగ్రహానికి గురవుతోంది. జాబితాలో ఓటర్ల ఫొటోలకు బదులు.. కుక్కలు, పువ్వుల బొమ్మలు రావడం విమర్శలకు తావిచ్చింది.

చిత్రాలు విచిత్రాలు: కుక్కలు, పువ్వులకు ఓటరు జాబితాలో చోటు
2 రోజుల క్రితం అధికారులు విడుదల చేసిన ఓటరు జాబితాలో... 12వ డివిజన్‌కు చెందిన బన్నీ అనే వ్యక్తి ఫొటోకు బదులు కుక్క బొమ్మ ముద్రించారు. మరో డివిజన్‌లో సంజీవరావు అనే వ్యక్తికి బదులు పువ్వు బొమ్మ వేశారు. జాబితాలో ఉన్న ఇలాంటి తప్పులపై వివిధ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముద్రణలో జరిగిన తప్పులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని నగరపాలక సంస్థ అధికారులు చెప్పారు.
చిత్రాలు విచిత్రాలు: కుక్కలు, పువ్వులకు ఓటరు జాబితాలో చోటు
ఇదీ చూడండి:మేడారంలో వర్షం.. తడుస్తూనే భక్తుల దర్శనం