ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం తూర్పు గ్రామానికి చెందిన బాలం శ్రీను, జయరాజు అన్నదమ్ములు. వీరి మధ్య గత కొంత కాలంగా సరిహద్దు వివాదం నడుస్తోంది. తాజాగా జరిగిన ఘర్షణలో శ్రీను.. జయరాజు పెంచుకుంటున్న శునకాన్ని దారుణంగా నరికి చంపాడు.
అన్నాదమ్ముల మధ్య వివాదం.. మధ్యలో బలైన శునకం.. - కాళీపట్నం నేర వార్తలు
అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణ ఓ మూగజీవి ప్రాణాలు తీసింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు శునకం దారుణంగా హత్యకు గురైంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఒళ్లుగగుర్పొడిచేలా జరిగిన ఈ ఘటన ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా కాళీపట్నంలో జరిగింది.
శునకాన్ని చంపిన వీడియో వైరల్
ఈ ఘటనపై జయరాజు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన జరిగిన సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
ఇదీచదవండి.