హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని ప్రశాంత్ నగర్ కాలనీలో ఓ పిచ్చి కుక్క నలుగురు చిన్నారులపై వేర్వేరు సమయాల్లో దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురికి తొడ భాగంపై మరో చిన్నారికి తలపై తీవ్ర గాయమైంది.
నలుగురు చిన్నారులపై పిచ్చికుక్క దాడి... తీవ్రగాయాలు - dog
ఓ పిచ్చికుక్క నలుగురు చిన్నారులపై దాడి చేసిన ఘటన హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని ప్రశాంత్‌నగర్‌లో జరిగింది. చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి.
నలుగురు చిన్నారులపై పిచ్చికుక్క దాడి... తీవ్రగాయాలు
దీనితో చిన్నారుల తల్లిదండ్రులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తీసుకెళ్లారు. సంబంధిత అధికారులు వాటిని పట్టుకుని వెళ్లాలని... లేకపోతే మరిన్ని ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని వాపోయారు.
ఇవీ చూడండి: అంబులెన్స్‌ను ఉపయోగంలోకి తేవాలని విపక్షాల నిరసన!