పాతపద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియను చేపట్టాలంటూ హైదరాబాద్ మూసారాంబాగ్‌లో దస్తావేజు లేఖరులు ధర్నా నిర్వహించారు. ఆజంపురాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు ప్రదర్శించారు.
ఆజంపురాలో దస్తావేజు లేఖరుల నిరసన - హైదరాబాద్ వార్తలు
ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేయాలంటూ దస్తావేజు లేఖరులు ఆందోళన నిర్వహించారు. హైదరాబాద్ మూసారాంబాగ్‌లోని ఆజంపురా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

ఆజంపురాలో దస్తావేజు లేఖరుల నిరసన
ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఇదీ చూడండి:వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన ఫిజికల్ డైరక్టర్లు