కంట్లో నలతపడినా.. నిద్ర వచ్చినా.. ముక్కు దురదపెట్టినా.. ఆవలింత వచ్చినా క్షణాల్లో మన చేయి ముఖం మీదకు వెళ్తుంది. ఇలా.. మనకు తెలియకుండానే మనం గంటకు దాదాపు 16సార్లు ముఖాన్ని చేతులతో తాకుతున్నాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఏదైనా వైరస్ మన శరీరంలోకి వేగంగా ప్రవేశించాలంటే ఇవే ప్రధాన మార్గాలు. ఇలా మాటిమాటికీ ముఖంపై చేతితో తాకడం వల్ల ప్రమాదకరమైన కొత్తకొత్త వైరస్‌లను మన శరీరంలోకి మనమే ఆహ్వానిస్తున్నామన్నమాట. ఇది వైద్యులు చెబుతున్న మాట. ఇది ఎవరికైనా అలవాటుగా వచ్చేది కానీ.. అనుకోని చేసేది కాదు. మరి దీని నుంచి ఎలా బయటపడాలి..? అనుకుంటున్నారా.. అయితే వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలు..
* చేతులను కడిగిన ప్రతిసారీ కనీసం 20 సెకన్లపాటు రుద్దాలి.
* హ్యాండ్‌వాష్ లేదా సబ్బు వాడటం తప్పనిసరి.
* ముఖంపైకి చేతులు వెళ్లకూడదని మైండ్‌లో ఫిక్సైపోవాలి.
* ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండాలి.