ఎన్ఎంసీ బిల్లును రద్దు చేయాలని మెహదిపట్నం వద్ద సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ముందు వైద్యులు ధర్నా నిర్వహించారు. తాము కష్టపడి 10 సంవత్సరాల పాటు ఈ విద్యను అభ్యసించిన తర్వాత ఈ స్థాయికి వచ్చామని తెలిపారు. అలాంటింది ఇంటర్, టెన్త్ పాసైన విద్యార్థులను బ్రిడ్జ్ కోర్స్ ద్వారా తమకు సమానంగా చికిత్స చేసే అవకాశం ఇస్తే... దీనివల్ల ప్రజలకు కచ్చితంగా ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు.వెంటనే ఈ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
'ఈ బిల్లును రద్దు చేయకపోతే ప్రజలకే ఇబ్బందులు'
ఎన్ఎంసీ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... హైదరాబాద్ మెహదీపట్నం వద్ద సరోజినీ దేవి కంటి ముందు ఆసుపత్రి వైద్యులు ధర్నాకు దిగారు. బిల్లు వల్ల ప్రజలకే ఎక్కువ నష్టం కలుగుతుందని తెలిపారు.
'ఈ బిల్లును రద్దు చేయకపోతే ప్రజలకే ఇబ్బందులు'