అనుమానం:
నాగోల్‌కు చెందిన పుష్ప(68) వెన్నెముక సమస్యతో బాధపడుతోంది. గత మూడు రోజుల క్రితం సికింద్రాబాద్ అపోలోలో చేరింది. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు. 'భాగానే ఉంది. కాసేపట్లో జనరల్ వార్డుకు పంపుతామని చెప్పి.. మళ్లీ అంతలోనే చనిపోయిందని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లనిర్లక్ష్యంతోనే తమ తల్లి ప్రాణం పోయిందని ఆందోళన చేపట్టారు. మరణానికిగల కారణాలు ఇప్పటికీ చెప్పట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.