చిన్నారి పాప ఏకబిగిన ఏడుస్తున్నా ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోక పాప మృతికి కారణమయ్యారని తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం కీసర మండలం ఇస్మాయిల్ గూడ రాంపల్లి గ్రామానికి చెందిన మాధురి, దినేశ్ కుమార్ దంపతులు తమ పాప ఏడుస్తోందని ఏఎస్‌రావు నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు. ఆసుపత్రిలో రాత్రి విధుల్లో వైద్యులు లేకపోవడం వల్ల చికిత్స అందక చిన్నారి చనిపోయింది. నిర్లక్ష్యంగా వ్యవహారించి పాప మృతికి కారణమయ్యారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ.... ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.
వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి! - వైద్యుల నిర్లక్ష్యంతో ఓ చిన్నారి ప్రాణాలు గాలిలో కలిశాయి
వైద్యుల నిర్లక్ష్యంతో ఓ చిన్నారి ప్రాణాలు గాలిలో కలిశాయి. ఈ ఘటన కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని ఏఎస్‌రావు నగర్‌లో చోటుచేసుకుంది.
వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి!