కరోనా వైరస్ గాలి ద్వారా రాదని... దగ్గుతున్నప్పుడు వచ్చే తుంపర్లతోనే వస్తుందని గాంధీ, అపోలో ఆసుపత్రుల వైద్యులు డా. వినయ్‌శంకర్, డా. విష్ణురావులు తెలిపారు. మాంసాహారం తినవచ్చని... పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. గుంపులుగా ఉన్న చోట మాస్క్‌లు తప్పక వాడాలన్నారు. ఎన్95 మాస్క్‌లు సాధారణ ప్రజలకు అవసరం లేదన్నారు. డాక్టర్ల సూచన లేకుండా క్లోరోక్విన్‌తో పాటు ఎలాంటి మందులు వాడొద్దని... ఇది అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. ఇతర జబ్బులు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఆల్కహాలిక్ శానిటైజర్‌ను వాడితే ఉపయోగం ఉంటుందని వెల్లడించారు.
ఏసీలకు దూరంగా ఉండటం మంచిది : వైద్యుల సూచన - Coronavirus Doctors Solutions
కరోనా ప్రబలుతున్న తరుణంలో ఏసీలకు దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఆల్కహాల్ ఉండే శానిటైజర్‌ను వాడితే ఉపయోగం ఉంటుందని వెల్లడించారు.
కరోనాపై వైద్యుల సూచనలు