'జస్టిస్ ఫర్ దిశ'కు కొవ్వొత్తుల నివాళి - shamshabad
శంషాబాద్ ఘటనను నిరసిస్తూ వైద్యులు, వైద్య విద్యార్థులు నెక్లెస్‌రోడ్డులో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఇలా మరో ఘటన జరగకుండా నిందితులను బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
'జస్టిస్‌ఫర్ దిశ'కు కొవ్వొత్తుల నివాళి
పశు వైద్యురాలి హత్యోదంతాన్ని నిరసిస్తూ పలువురు వైద్యులు, వైద్య విద్యార్ధులు పెద్ద సంఖ్యలో నెక్లెస్ రోడ్డులో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. తప్పు చేసిన వాళ్లకు ప్రజల ముందే శిక్షపడాలని వైద్యులు డిమాండ్ చేశారు. మద్యం అందుబాటులో లేకుండా చేయాలని, నిత్యవసర సరుకుల్లా కాకుండా మద్యం ధరలు పెంచాలని కోరారు. మరొకసారి ఆడపిల్లల జోలికి వెళ్లాలంటే భయపడేట్లు నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: పశువైద్యురాలి పేరు ఇకపై 'జస్టిస్ ఫర్ దిశ'