తెలంగాణ

telangana

ETV Bharat / state

బాడీబిల్డర్​కు కొత్త జీవితాన్నిచ్చిన యశోదా ఆసుపత్రి వైద్యులు - యశోద హాస్పిటల్ తాజా వార్తలు

కొవిడ్ బారినపడి సుదీర్ఘ కాలం పాటు వెంటిలేటర్​పై ఉన్న బాడీ బిల్డర్​కు మలక్​పేటలోని యశోద ఆసుపత్రి వైద్యులు సరికొత్త జీవితాన్నిచ్చారు. మహమ్మారి సోకి విషమ పరిస్థితుల్లో ఉన్న అతడికి సరైన రీతిలో చికిత్స అందించి ప్రాణాలను నిలబెట్టారు.

Doctors at Yashoda Hospital rescue a bodybuilder suffering from covid
బాడీబిల్డర్​కు కొత్త జీవిత్తాన్నిచ్చిన యశోదా ఆసుపత్రి వైద్యులు

By

Published : Jun 19, 2021, 10:06 PM IST

కరోనా బారినపడి తీవ్రమైన బాక్టీరియల్​, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న మలక్​పేటకు చెందిన బాడీ బిల్డర్ సుశీల్ కుమార్(32)ను సురక్షితంగా కాపాడినట్లు యశోదా వైద్యులు ప్రకటించారు. గత నెలలో వైరస్ సోకిన సుశీల్ స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఈ క్రమంలో అతడి పరిస్థితి విషమించడం మే 19న నటుడు సోనూసూద్ సహాయంతో మలక్​పేటలోని యశోదా ఆస్పత్రిలో చేర్పించారు.

దాదాపు 80 శాతానికిపైగా ఊపిరితిత్తులు పాడైన పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన సుశీల్​ కుమార్​ను సుమారు నెల రోజుల చికిత్స అనంతరం క్షేమంగా డిశ్చార్జ్ చేసినట్టు వైద్యులు ప్రకటించారు. బాధితుడు ఆసుపత్రిలో చేరినప్పటికే అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించామని పేర్కొన్నారు. సుశీల్​ను ఆసుపత్రికి చేర్చే విషయంలో నటుడు సోనూసూద్ అందించిన సాయం ఎంతో గొప్పదని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్ పవన్ గోరుకంటి కొనియాడారు.

ఇదీ చదవండి:ARREST: ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ముఠా అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details