తెలంగాణ

telangana

ETV Bharat / state

'వైద్య సిబ్బంది పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది' - doctors on kcr

కరోనాతో మృతి చెందిన వైద్యులు, సిబ్బందికి ప్రభుత్వం ప్రకటించిన పరిహారం పూర్తి స్థాయిలో అందడం లేదని వైద్య సంఘాలు ఆరోపించాయి. వైద్యులు, సిబ్బంది పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశాయి. వైద్యుడు కరోనా బారిన పడితే అతనితో పాటు కుటుంబ సభ్యులకు సోకితే ప్రభుత్వమే అన్ని విధాలుగా సాయం చేయాలని డిమాండ్ చేశాయి.

doctors associations
doctors associations

By

Published : Aug 24, 2020, 9:41 PM IST

కరోనా సమయంలో ముందుండి పని చేస్తున్న డాక్టర్లు, సిబ్బంది, నర్సులు సహా వారి పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని వైద్య సంఘాలు ఆరోపించాయి. వైద్య సిబ్బంది మరణిస్తే పరిహారం ప్రకటించి జాప్యం చేయకుండా అందిచేలా చూడాలని డిమాండ్ చేశాయి. ఇటీవల మృతి చెందిన భద్రాచలం వైద్యుని విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో సాయం చేయలేదని ఆరోపించాయి.

వైద్యుడు కరోనా బారిన పడితే అతనితో పాటు కుటుంబ సభ్యులకు సోకితే ప్రభుత్వమే అన్ని విధాలుగా సాయం చేయాలని డిమాండ్ చేశాయి. ఇప్పటి వరకు చనిపోయిన వైద్యులకు, వైద్య సిబ్బందికి తక్షణమే పరిహారం ప్రకటించాలని కోఠిలోని వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుల కార్యాలయం ముందు వైద్య సంఘాలు ఫ్లకాడ్లతో నిరసన తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details