కరోనా మహమ్మారి బారినపడి చనిపోయిన డా.నరేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శుభోద్ కోరారు. అతని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
'ఆ వైద్యులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది' - గాంధీ ఆస్పత్రిలో డా. నరేశ్‌కు నివాళి
కొవిడ్ మహమ్మారి బారినపడిన వైద్యులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శుభోద్ అన్నారు. కరోనాతో ఇటీవల మృతి చెందిన డా.నరేశ్‌కు గాంధీ ఆస్పత్రిలో వైద్యులు నివాళులర్పించారు.
!['ఆ వైద్యులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది' doctors association tribute to doctor naresh at gandhi hospital hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8365003-811-8365003-1597053818754.jpg)
ఆ వైద్యులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది
డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. గాంధీ ఆస్పత్రిలో వైద్యులు డా.నరేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించారు. అతని మరణం తనకు ఎంతగానో కలిచివేసిందని ఆయన వాపోయారు.