నిన్న గాంధీ ఆస్పత్రిలో డాక్టర్ వసంత్‌పై జరిగిన ఘటనపై చర్చించడానికి తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక సమావేశమయ్యారు. డాక్టర్ వసంత్‌పై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వైద్యులు డిమాండ్ చేశారు. అతన్ని విధుల నుండి తొలగించడం హేయమైన చర్యగా పేర్కొన్నారు.
వసంత్‌ను విధుల్లోకి తీసుకోవాలి: డాక్టర్స్ అసోసియేషన్ - వసంత్‌ను విధుల్లోకి తీసుకోవాలి: డాక్టర్స్ అసోసియేషన్
డాక్టర్ వసంత్ ఘటన దృష్ట్యా తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక సమావేశమయ్యారు. అతన్ని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వసంత్‌ను విధుల్లోకి తీసుకోవాలి: డాక్టర్స్ అసోసియేషన్
వసంత్‌పై జరిగిన అన్యాయాన్ని డాక్టర్ల సంఘం తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ డాక్టర్ల పట్ల ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇదే విషయంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు మరోసారి సమావేశంకావాలని నిర్ణయించారు.