కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు కరోనాపై అవగాహన కార్యక్రమాలు చేపట్టటంతో పాటు... వైద్యవిధానాలను తెలుసుకునేందుకు కేరళ, దిల్లీలకు ఒక బృందాన్ని పంపింది. పలు ప్రభుత్వశాఖల సహకారంతో చర్యలు తీసుకుంటున్నామంటున్న డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్యకృష్ణ ముఖాముఖి.
'కేరళ, దిల్లీకి ప్రత్యేక బృందాన్ని పంపించాం' - Carona virus
ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కోవిడ్ -19 వైరస్ పట్ల రాష్ట్రప్రభుత్వం దృష్టిసారించింది. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. దీనికోసం ప్రైవేటు ఆస్పత్రుల సహకారం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలకు అవగాహన కోసం అన్ని మాధ్యమాలను ఉపయోగించుకొని ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు.
'కేరళ, దిల్లీకి ప్రత్యేక బృందాన్ని పంపించాం'